పంటలలో విత్తనశుద్ధితో అధిక లాభాలు

Published on Feb 22nd, 2022

రైతులు ప్రతీ ఏటా వర్షపాత కొరత, ధరల అస్థిరత మరియు పెరుగుతున్న రుణ సమస్యలతో బాధ పడుతుంటారు వాటి తో పాటు నాణ్యమైన విత్తనాల లభ్యత అనేది ప్రధాన సమస్యగా నిలుస్తుంది, ఒక వేళ నాణ్యమైన విత్తనాలు దొరికినా వాటి విత్తనోత్పత్తి శాతం వివిధ అంశాల పైన ఆధారాపాడి ఉంటుంది వాటి తో పాటు ముఖ్యమైనది పంటను ఆశించే చీడ పీడలు, అయితే ఈ చీడ పీడల సమస్య విత్తన శుద్ధి ద్వారా కొంత వరకు అరికట్టవచ్చును.

విత్తనశుద్ధి ద్వారా నేల నుండి వ్యాపించే తెగుళ్లను మరియు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చును. రైతులు ప్రధానంగా వరి ,కంది, పత్తి, వేరుశనగ మరియు అపరాలు వంటి అనేక పంటలను సాగు చేస్తారు.

ఈ క్రింది పంటలలో పాటించే విత్తన శుద్ధి పద్దతులను ఇప్పుడు చూద్దాం

గోధుమ: గోధుమలో విత్తనశుద్ధికై 2.5 గ్రాముల థైరం ఒక కిలో విత్తనానికి పట్టించి తుప్పు తెగులును నివారించుకోవచ్చు.

వరి: వరి లో ముఖ్యముగా కార్బైండిజమ్తో విత్తనశుది చేయాలి అయితే తడి పద్ధతి లో విత్తన శుద్ధి కొరకు ఒక గ్రాము కార్బైండిజమ్ ఒక కిలో విత్తనానికి పట్టించి, లీటరు నీటిలో నానబెట్టి మండె కట్టుకోవాలి. పొడి పద్ధతిలో విత్తనశుద్ధి చేసినట్టయితే ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బైండిజమ్ బాగా కలిసేలా పట్టించాలి.

వేరుశనగ: వేరుశనగలో విత్తనశుద్ధికై 1 గ్రా. టేబుకోనజోల్ 2 డీ.ఎస్ లేదా మాంకోజెబ్ ౩ గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించాలి. ఇమిడాక్లోప్రిడ్ 6౦౦ ఎస్. ఎఫ్ 1 మీ. లీ., 7 మీ. లీ. నీటిలో కలిపి కిలో విత్తనానికి పట్టించుకోవాలి అయితే ఇది వైరస్ తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు ఎక్కువ గా ఉన్న ప్రాంతం లో చేసుకోవాలి.

గోధుమ: గోధుమలో విత్తనశుద్ధికై 2.5 గ్రాముల థైరం ఒక కిలో విత్తనానికి పట్టించి తుప్పు తెగులును నివారించుకోవచ్చు.

ALSO READ : https://jaihokisan.in/harvest-crops-in-three-months.html

కంది, పెసర, మినుము: ఈ పంటల విత్తనశుద్ధికి ౩ గ్రాముల కాప్టాన్ లేదా ధైరామ్ కిలో విత్తనానికి పట్టించాలి. జీవనియంత్రణకై 200 నుండి 400 గ్రాముల రైజోబియం ఎకరాకు సరిపడే విత్తనానికి కలిపి విత్తుకోవాలి లేదా 8 -10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

సజ్జ: సజ్జలో విత్తనశుద్ధికై 6 గ్రాముల ఆప్రాన్ 35 ఎస్.డీ. తో విత్తనశుద్ధి చేసినట్టయితే పచ్చకంకి వెర్రి తెగులును నివారించవచ్చును.

ప్రత్తి: ప్రత్తి లో విత్తనశుద్ధి కొరకు 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే లేదా 10 గ్రాముల సూడోమోనాస్ తో కొంచం జిగురు కలిపి విత్తే ముందు విత్తనశుద్ధి చేసుకోవాలి.

గోధుమ లో విత్తనశుద్ధి

ఈ విధంగా వివిధ పంటల విత్తశుద్ధి ద్వారా మొలక మరియు నారుమడి లో ఆశించే అనేక రకాల తెగులను మరియు చీడపీడలను నివారించవచ్చును. వివిధ పంటల పంటసాలహాల కొరకు జై హో కిసాన్ మొబైల్ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోండి.ఈ అప్ లో పంట సలహాలే కాకుండా రైతులకు సంబందించిన అన్ని రకాల సమాచారములు అనగా, మార్కెట్ ధరలు, రైతు రుణ సంబంధిత వివరాలు మరియు రోజు వారి వాతావరణ సమాచారం కూడా లభిస్తుంది.